ప్రకాశం: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు కందుకూరు పట్టణ పోలీసు శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలలో స్థానిక టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. కందుకూరు పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు విద్యార్థులు రోడ్డు భద్రతపై నినాదాలు చేసుకుంటూ వెళ్లారు.