KKD: జగ్గంపేట నియోజకవర్గం తాళ్లూరు గ్రామంలో నిర్మించిన తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం పునఃనిర్మాణం చేపట్టి రైతన్నలకు వచ్చే ఖరీఫ్ పంటకు సాగునీరు అందివ్వాలని జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. ఈమేరకు ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతన్నలను ఆదుకోవాలన్నారు.