HNK: ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో సర్వేను ప్రైవేటు వ్యక్తులతో తప్పుల తడకగా నిర్వహించారని, అర్హులైన లబ్ధిదారుల పేర్లు లిస్టులో లేవని మంగళవారం గ్రామ పంచాయతీ ఎదుట పలువురు యువకులు నిరసనను వ్యక్తం చేశారు. అర్హులైన వారి పేర్లు లిస్టులో లేకుండా అనర్హుల పేర్లు లిస్టులో ఉన్నాయని, అధికారులు మళ్ళీ సర్వే చేసి అసలైన పేద వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.