ATP: గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద సోమవారం ప్రజాసంఘాలు, అఖిలపక్షాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు నిర్మల, నాగభూషణం మాట్లాడుతూ.. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు.