NDL: నంద్యాల జిల్లా కోర్టులో న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు. అనంతపురంలో న్యాయవాది శేషాద్రి పోలీసుల వల్ల గుండెపోటుతో మరణించారని, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. నేడు కోర్టు విధులు బహిష్కరించి, రేపు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.