ప్రకాశం: రాచర్ల మండలంలోని రాగిరెడ్డిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో రాచర్ల పోలీసులు పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.6,530 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయాలు, పేకాట లాంటి అసాంగిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.