ASR: నిరుద్యోగ యువకులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని గంగవరం ఎంపీపీ పల్లాలు కృష్ణారెడ్డి శనివారం అన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించిన జాబ్ మేళాలో 58 మంది యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అపోలో ఫార్మసీ, ఎన్ఎస్ ఇన్స్ట్రూమెంట్స్, మోహన్ స్పిన్ టెక్స్ సంస్థలు పాల్గొని ఎంపికలు చేశారు.