ప్రకాశం: కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం నందు గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం ఎంపీడీవో రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఉద్యోగస్తులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అ కారణంగా ఎంపీడీవో పై దాడికి పాల్పడటం దుర్మార్గపు చర్య అని రాజ్యలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులపై దాడులు సరికాదన్నారు.