ప్రకాశం: పొదిలి పట్టణంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి కోరారు. ఈ మేరకు శనివారం నగర పంచాయతీ కమిషనర్‌కు విజ్ఞాపన పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి సేవలు అందించిన వాజ్‌పేయికి సముచిత స్థానం కల్పించాలన్నదే తమ ఆశయం అన్నారు.