E.G: నిడదవోలు మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందులు దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ భూపతి ఆదినారాయణ పాల్గొన్నారు.