NLR: గాలివీడు మండలం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అయిన జవహర్ బాబు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ శనివారం విడవలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది నిరసన చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నగేష్ కుమారి మాట్లాడుతూ.. ఎంపీడీవో పై దాడి అనేది చాలా హేయమైన చర్య, నిందితులపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలన్నారు.