TG: త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత 300 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే, FTL, బఫర్ జోన్లపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. హైడ్రా ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడిందని తెలిపారు. హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో అక్రమ నిర్మాణాలపై అవగాహన పెరిగినట్లు వెల్లడించారు.