VSP: చింతపల్లి మండలంలోని లంబసింగి, కొయ్యూరు మండలం బంగారమ్మపేట, పరదేశిపాకలు గ్రామాల్లో నాటుసారాతో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఎక్సైజ్ సీఐ జే.కూర్మారావు శనివారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బంది, టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల్లో దాడులు నిర్వహించగా, 114 లీటర్ల నాటుసారాతో నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారని తెలిపారు.