చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ప్రత్యేక చర్చల నిమిత్తం చైనా పర్యటనకు వెళ్లిన దోవల్ ఆయనతో భేటీ అయ్యారు. భారత్‌తో కలిసి పని చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని, వీలైనంత త్వరగా ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి కృషి చేస్తోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.