ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అదానీ గ్రూప్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అదానీని అరెస్టు చేసి విచారిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలకు సీపీఐ వ్యతిరేకమని.. ఇండియా కూటమిలోని పార్టీలు వ్యతిరేకతను వ్యక్తం చేయాలని సూచించారు.