SKLM: అక్రమంగా నాటుసారా ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నేడు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 36 లీటర్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ కె.బేబి తెలిపారు. కంచిలి మండలం బీపీ కాలనీకి చెందిన ఎస్. మహేష్, మున్సిపేటకు చెందిన కె.మోహనరావులు 36 లీటర్ల నాటు సారా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేశారు.