BDK: బూర్గంపాడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని ఓటర్లకు అవగాహన కల్పించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఓటర్లకు అవగాహన కల్పించేలా ముగ్గులు వేసిన మహిళలకు ఎంపీడీవో జమలారెడ్డి తన చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.