చెన్నై ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ.1.30కోట్లు విలువైన 1.7 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు అదే విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 7.5 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.76 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.