TG: రేపటి నుంచి హైదరాబాద్లో పుస్తకాల పండుగ మొదలుకానుంది. ప్రతి ఏటా డిసెంబర్లో నిర్వహించే బుక్ ఫెస్టివల్ ఈసారి కూడా ఎన్టీఆర్ స్టేడియంలోప్రారంభంకానుంది. ఈనెల 19 తేదీ నుంచి 29 వరకు పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవం ప్రాంగణానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ఈ ఏడాది మహాకవి దాశరథి కృష్ణమాచార్య పేరును ప్రకటించింది. పుస్తకావిష్కరణలకు ఈసారి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.