భారత మహిళల జూనియర్ హాకీ జట్టు అదరగొట్టింది. వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన భారత్ మొదటి నుంచి సత్తాచాటింది. ఫైనల్లో మాజీ చాంపియన చైనాను 1-1(3-2) తేడాతో షూటౌట్లో చిత్తు చేసింది. దీంతో సౌత్ కొరియా, చైనా తర్వాత వరుసగా రెండుసార్లు, ఒక్కటి కంటే ఎక్కువసార్లు టైటిల్ నెగ్గిన మూడో జట్టుగా భారత్ నిలిచింది.