AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. మంగళగిరిలోని క్యాంపు ఆఫీస్‌లో డిప్యూటీ సీఎంను తండ్రి రమణతో కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈనెల 22న వెంకట దత్త సాయిని సింధు పెళ్లి చేసుకోబోతున్నారు. మరోవైపు వారు అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.