KMM: భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామ ఆఫీసర్స్ క్లబ్లో జిల్లాస్థాయి టెన్నిస్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.