ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విన్నర్‌గా 18ఏళ్ల కుర్రాడు గుకేష్ గెలిచి చరిత్ర సృష్టించాడు. తాజాగా తన తల్లి ఎప్పుడూ చెప్పే విషయం గురించి అతను గుర్తు చేసుకున్నాడు. ‘నువ్వు గొప్ప చేసే ప్లేయర్‌గా పేరు తెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడానికి మరింత ఆనందిస్తానని మా అమ్మ చెబుతుంది. ఇప్పటికీ అదే విషయాన్ని చెబుతూ ఉంటుంది. ఆ మాటలకు నేను ఎక్కువ విలువ ఇస్తాను’ అని చెప్పాడు.