»Six Killed In Fire At Shopping Mall In Secunderabad
secunderabad fire accident: 6గురి దుర్మరణం.. అందరూ 22 ఏళ్లే, తప్పిన పెనుప్రమాదం
సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్న లోక్ కాంప్లెక్స్ లో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు.
సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్న లోక్ కాంప్లెక్స్ లో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. మృతి చెందిన వారిని ప్రమీల (22), వెన్నెల (22), శ్రావణి (22), త్రివేణి (22), శివ (22), ప్రశాంత్ గా (23) గుర్తించారు. మృతుల్లో వరంగల్ కు చెందిన ముగ్గురు, ఖమ్మంకు చెందిన ఒకరు, మహబూబాబాద్ వాసులు ఇద్దరు ఉన్నారు. ఈ ఘటనలు పలువురిక గాయాలు అయ్యాయి. వారిని అపోలో, యశోద హాస్పిటల్స్ కు తరలించారు. భవనంలో తొలుత మంటలు చెలరేగి, ఆ తర్వాత ప్రయివేట్ ఆఫీస్ లు ఉన్న నాలుగు, ఐదు, ఆరు అంతస్తులకు వ్యాప్తించాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది పలువురిని కాపాడింది. స్పృహ కోల్పోయిన వారిని గాంధీ హాస్పిటల్ తరలించారు. నాలుగు గంటల పాటు శ్రమించి, మంటలను ఆర్పేశారు.
గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు మంటలు అంటుకున్నాయి. ఎనిమిది అంతస్తుల ఈ భవనంలో మొదట ఏడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తు వరకు వ్యాప్తించాయి. అయిదో అంతస్తులో పేలుడు సంభవించడంతో మంటలు పెరిగాయి. ఇక్కడ బట్టల దుకాణాలు, కాల్ సెంటర్లు, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్స్, కొన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు ఉన్నాయి. స్వప్న లోక్ కాంప్లెక్స్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఒక్కసారిగా మంటలు రావడంతో యజమానులు, ఉద్యోగులు, పని చేసేవారు, షాపింగ్ కోసం వచ్చిన వారు కిందకు పరుగు పెట్టారు. మంటల్లో పదిహేను మంది వరకు చిక్కుకున్నారు. వారిని భారీ క్రేన్లతో బయటకు తీసుకు వచ్చారు. శ్రావణ్, భారతమ్మ, సుధీర్ రెడ్డి, పవన్, దయాకర్, గంగయ్య, రవిలను అగ్నిమాపక సిబ్బంది రక్షించింది. వీరు దాదాపు నాలుగు గంటల పాటు పొగలో చిక్కుకున్నారు. వీరంతా దట్టమైన మంటలు, పొగలో చిక్కుకొని… కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు.
అగ్ని ప్రమాదం తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ టార్చ్ లైట్ చూపిస్తూ.. కాపాడాలని వేడుకోవడం కలిచివేసింది. కాసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆర్తనాదాలు ఆగిపోయాయి. స్వప్న లోక్ కాంప్లెక్స్ మొత్తం రెండు బ్లాకుల్లో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 400 వరకు దుకాణాలు ఉన్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు తీవ్ర రద్దీ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ లో వేలాది మంది ఉద్యోగం చేస్తారు. మంటలు అంటుకునే సమయానికి అయిదో అంతస్తు నుండి ఏడో అంతస్తు మధ్య ఉన్న చాలా కార్యాలయాల్లోని సిబ్బంది ఇంటికి వెళ్లిపోయింది. దీంతో భారీ పెను ప్రమాదం తప్పింది. అలాగే, కాంప్లెక్స్ లలోని రెండు బ్లాక్స్ మధ్య దూరం ఉండటంతోను ప్రమాద తీవ్రత తగ్గింది.