రాజమౌళి(rajamouli)-మహేష్ బాబు(mahesh babu) సినిమా గురించి.. ఇంకా ఎలాంటి అధికారిక అప్టేట్స్ లేకపోయినా.. రోజుకో న్యూస్ వినిపిస్తునే ఉంది. ఆర్ఆర్ఆర్తో హాలీవుడ్‌ని అట్రాక్ట్ చేసిన జక్కన్న.. మహేష్‌తో గ్లోబల్ మార్కెట్ టార్గెట్‌గా సినిమా చేయబోతున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ ఈ మూవీని నిర్మించబోతున్నారు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ సినిమా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా స్టార్ట్ కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై కథపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామా.. కొన్ని కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి.. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ బాలీవుడ్ మీడియాతో తెలిపినట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అంటున్నాడు కాబట్టి.. నిజ జీవిత కథ అంటే నమ్మశక్యంగా లేదు. అయినా పుకార్లు మాత్రం ఆగడం లేదు.
మరో అప్టేట్ ఏంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోనే(deepika padukone) ఫిక్స్ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. అయితే ఎలాంటి విషయమైనా సరే.. రాజమౌళి అధికారికంగా చెప్పేవరకు క్లారిటీ వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌లో ఉన్నాడు.