ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 85 శాతం చొప్పున అర్హులైన ఉద్యోగులకు పనితీరు ఆధారిత బోనస్ చెల్లించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో బోనస్ ఇచ్చేందుకు నిర్ణయించింది. నవంబర్ వేతనంతో బోనస్ చెల్లించనుంది. సంబంధిత త్రైమాసికంలో ఉద్యోగి పనితీరు, సహకారం ఆధారంగా చెల్లించనుంది. అయితే, ఏ కేటగిరీకి ఎంత చెల్లిస్తుందని వెల్లడించలేదు.