దేశ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత షా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన షా.. పటిష్ఠ భారత్ నిర్మాణానికి దేశ ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యంగమే బలం అని కొనియాడారు. జాతీయ ఐక్యత, సమగ్రతకు ఇదే శక్తిమంతమైన మంత్రం అని అన్నారు.