ADB: కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పీఎం జన్ మన్ పథకంలో భాగంగా జిల్లాలోని మొలల గుట్ట, పోతుగూడ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. వచ్చే ఐదేళ్లలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు.