TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ CM రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘రాహుల్ మీ ముందు చూపు, ఆలోచనలు, పని నుంచే మేం ప్రేరణ పొందాం. మీ వాగ్దానాలకు అనుగుణంగా తెలంగాణ గిగ్ వర్కర్స్ పాలసీని సమగ్రంగా, మార్గదర్శకంగా మారుస్తాం’ అని రేవంత్ పేర్కొన్నారు.