SKLM: పోలాకి మండలం వనవిష్ణుపురంలో ఇటీవల జరిగిన హత్య నేపథ్యంలో నేటివరకు పోలీసులు పహారా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యలుగా గ్రామంలో 8 సీసీ కెమెరాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. వీటిని నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం వాటిని ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫుటేజ్ ఎస్పీ కార్యాలయానికి నేరుగా వెళ్తుందని వివరించారు.