అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కార్యవర్గంలోని భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్య ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉందని వెల్లడించారు. ‘లక్షల మంది ఫెడరల్ బ్యూరోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి సామూహికంగా తొలగించే స్థాయిలో నేను, ఎలాన్‌మస్క్ ఉన్నాం. అలా ఈ దేశాన్ని మేం కాపాడాలనుకుంటున్నాం’ అని ఉద్యోగుల కోతలపై సంకేతాలిచ్చారు.