ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుంది. నెల రోజులకుపైగా నగరంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. నిత్యం గాలి నాణ్యత సూచీ 400 పాయింట్లకుపైగా నమోదవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి నెలకొందని షికాగో యూనివర్సిటీ తెలిపింది. వర్సిటీ అధ్యయనంలో ఢిల్లీలో గాలీ పీల్చడమంటే రోజుకూ 25-35 సిగరెట్లు తాగడంతో సమానమని తేలింది. ప్రజల ఆయు ప్రమాణం కూడా 7.8 ఏళ్ల దాకా తగ్గుతోందని తెలిపింది.