డిజిటల్ అరెస్టు పేరుతో కొందరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా విజయవాడకు చెందిన ఓ యువతి HYDలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటారు. ఆమెకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ముంబయి పోలీసులంటూ పరిచయం చేసుకున్నాడు. మీకు వచ్చిన కొరియర్లో మాదక ద్రవ్యాలున్నాయని మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామంటూ భయపెట్టాడు. అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని చెప్పడంతో యువతి భయపడి.. రూ.1.25 కోట్లు ఆగంతకుడికి పంపించింది.