సౌందర్యాలంకరణ రంగంలో ఉన్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బ్యూటీషియన్ల కోసం కేంద్రం ‘ది ఉమెన్ ఆంట్రప్రెన్యూర్షిప్ ప్లాట్ ఫాం(WEP)’తో కొత్త పథకం ప్రకటించింది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నడిచే ఈ పథకం ద్వారా బ్యూటీషియన్లు తమ వ్యాపారాలను మెరుగుపర్చుకునేందుకు తోడ్పాటు అందించనున్నారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కోసం ఢిల్లీలో 25 మంది మహిళలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నారు.