ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి లక్నో మధ్య ప్రత్యేక రైలును ప్రారంభించింది. ఈ రైలు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్ నుంచి లక్నోకు బయలుదేరుతుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. ఈనెల 18, 25 తేదీల్లో లక్నో నుంచి సికింద్రాబాద్కు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.