NRML: ఆదివాసి గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. ధర్తీ ఆబ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉట్నూర్‌లోని ఐటిడిఎ కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన గౌరవ దినోత్సవ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం దేశ ప్రధాని సందేశాన్ని అందరూ వీక్షించారు.