ELR: పోలవరంలో శుక్రవారం పోలవరం 1, పోలవరం 3 రైతు సేవ కేంద్రాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్దతు కింటాకు 2,300 రూపాయలు సాధారణ రకం & గ్రేడ్ ఏ 2320 రూపాయలుగా నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. హమాలీ చార్జీలు, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వం భరించి గోను సంచులను సరఫరా చేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.