HYD: మూసాపేట క్రితుంగా రెస్టారెంట్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో పరిసర ప్రాంతాల్లో బొద్దింకలు అధికారులు గుర్తించారు. రిఫ్రిజిరేటర్లో పెట్టిన ఆహార పదార్థాలపై లేబులింగ్ లేదని, కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లుగా తెలిపారు. ఈ మేరకు యాజమాన్యాన్ని హెచ్చరించామని పేర్కొన్నారు.