నెల్లూరు: తాను ఎంపీటీసీగా ఎన్నికైన నుంచి ఏనాడు కూడా సర్వసభ్య సమావేశానికి పలుశాఖల అధికారులు హాజరు కాలేదని బుచ్చి మండలం పెనుబల్లి ఎంపీటీసీ వినయ్ నారాయణ అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే వచ్చారని భయం భక్తితో అన్ని శాఖల అధికారులు వచ్చారని ఆయన చెప్పగా, ఎమ్మెల్యే స్పందిస్తూ చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ వల్లే అధికారులు వచ్చారని అన్నారు.