దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 55 పాయింట్లు నష్టపోయి 79,486 వద్ద ముగియగా.. నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 24,148 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, నెస్లే కంపెనీల షేర్లు లాభపడగా.. కోల్ ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.