WGL: విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉండాలని పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి గాయపు లింగారెడ్డి అన్నారు. బాలురఆశ్రమ పాఠశాలలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాల బారినపడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. మాదకద్రవ్యాల వినియోగం వలన దుష్పరిణామాలను వివరించారు.