కృష్ణా: గూడూరు మండలం పొట్టేలు గుంటయపేట గ్రామంలో వేణుగోపాలస్వామి దేవస్థానంలో గ్రామస్థులు శుక్రవారం ధ్వజ దండ విమాన గోపురం ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్వాహక కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య పాల్గొన్నారు. అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.