AKP: దేవరాపల్లి సర్వే నెంబరు 259/2 పినకోట రోడ్డులో గ్రామకంఠం భూమి అమ్మకాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకన్న డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కోటి రూపాయల విలువ చేసే గ్రామ కంఠం స్థలాన్ని అమ్మిన, కొన్న వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకొని గ్రామకంఠం భూమిని కాపాడాలన్నారు.