కోనసీమ: డిగ్రీ పూర్తి చేసి అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేసుకోవాలని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ సూచించారు. రాజోలు మండలం బి.సావరంలో బుధవారం ఎమ్మెల్సీ ఓట్ల నమోదుపై ఎమ్మెల్యే సమీక్ష జరిపారు. ఈరోజు సాయంత్రం గడువు ముగుస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు యుద్ధప్రాతిపదికన ఓట్లు నమోదు చేయించుకోవాలన్నారు.