JGL: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కటింగ్ పేరిట మిల్లర్లు ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు.