AP: సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా సోషల్ మీడియాలో పోస్టులపై చర్చించారు. DY. CM పవన్ ఈ అంశంపై లేవనెత్తారు. కొంతమంది వైసీపీ నేతలు మళ్లీమళ్లీ పోస్టులు పెడుతున్నారని, వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని.. కొంతమంది పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్కు వత్తాసు పలికిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా కీలక పోస్టుల్లో ఉన్నారని పేర్కొన్నారు.