AP: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు, ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనితలపై అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో వర్ర రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టారనే కారణాలతో ఆయనను అరెస్టు చేశారు. షర్మిల, సునీత, విజయమ్మపైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. రవీందర్ రెడ్డిని కడప తాలూకా పోలీస్ స్టేషన్ తరలించారు.