పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ATP ఫైనల్స్‌కు సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ దూరమయ్యాడు. ఈ నెల 10 నుంచి 17 వరకు ఇటలీలో జరిగే ఈ టోర్నీ ఫైనల్స్‌లో గాయం కారణంగా పాల్గొనడం లేదని మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ‘ ఫైనల్స్ ఆడాలని ఆసక్తితో ఎదురుచూశా. కానీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. నా ఆట చూసేందుకు ప్లాన్ వేసుకున్న వారిని క్షమించాలని కోరుతున్నా’ అని తెలిపాడు.