AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరో 12 ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ సుధీర్ ఈ ప్రక్రియ జరిపించారు. కాగా ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం త్వరలోనే పిఠాపురంలో ఇల్లు, క్యాంప్ కార్యాలయాల నిర్మాణాలను పవన్ చేపట్టనున్నట్లు జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు.