AP: ప్రతీ కుటుంబంలో భేదాభిప్రాయాలు ఉండటం సహజమని వైఎస్ విజయమ్మ అన్నారు. అంత మాత్రనా తల్లికి కుమారుడు కాకుండా పోతాడా? చెల్లికి అన్న కాకుండా ఉంటాడా? అని ప్రశ్నించారు. తమ కుటుంబంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరగటం బాధాకరమని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం తనకి జరిగిన కారు ప్రమాదానికి జగన్ కారణమంటూ వస్తున్న వార్తలపై ఫైర్ అయ్యారు. తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిస్తూ వీడియో విడుదల చేశారు.